నంద్యాలలో ఘనంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు
NANDYAL Sep08:- ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్ (IAP) నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు మంగళవారం సాయంత్రం *శ్రీకృష్ణ ఫిజియోకేర్ అండ్ పెయిన్ క్లినిక్, దేవనగర్, నంద్యాలలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని ఫిజియోథెరపిస్టులు, వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా IAP నంద్యాల జిల్లా శాఖ జనరల్ సెక్రటరీ డా. శివ బాలి రెడ్డి కాటసాని మాట్లాడుతూ, ఫిజియోథెరపీ కేవలం నొప్పి తగ్గించే చికిత్స మాత్రమే కాదని, వ్యాధుల నివారణ, శారీరక సామర్థ్య పెంపు, శస్త్రచికిత్స అనంతర కోలుకోవడం, సమగ్ర పునరావాసంలో కీలకమైన ఆరోగ్య సేవ అని తెలిపారు.జిల్లా శాఖ కన్వీనర్ డా. రోహిణి విజయ్, ట్రెజరర్ డా. జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ, ఫిజియోథెరపీ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజలు ప్రతిరోజూ శారీరకంగా చురుకుగా ఉండాలని, అవసరమైనప్పుడు అర్హత కలిగిన ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు.ఈ ఏడాది ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ అంశమైన *“గుండె–రక్తనాళ వ్యాధులు, పక్షవాతం నివారణ, నిర్వహణ మరియు పునరావాసంలో ఫిజియోథెరపీ, శారీరక వ్యాయామం పాత్ర”*పై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో సెవెన్ హిల్స్ హాస్పిటల్‌కు చెందిన ఆర్థోపెడిక్ డా. సందీప్ కుమార్, డా. రుఫస్ అసోసియేట్ ప్రొఫెసర్, ఉదయ్ శంకర్, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డా. శ్రీరామచంద్ర మూర్తి పాల్గొని ఫిజియోథెరపిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు.
Arattai