తాత్కాలికమైన సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: డాక్టర్ ఆరిఫా భాను
NANDYAL Sep10 :- తాత్కాలికమైన సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని న్యూరోసైక్రియాటిస్ట్ ఆరిఫా భాను తెలిపారు.గురువారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోనిశ్రీ రామకృష్ణ డిగ్రీ (అటానమస్) కాలేజ్ ఆవరణలో ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం (World Suicide Prevention Day) అవగాహన సదస్సు కళాశాలలోని అన్ని విభాగాలు (All Departments) సంయుక్తంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.

ఈ కార్యక్రమానికి నంద్యాల పట్టణ ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఆరిఫా బానో ముఖ్య అతిథిగా హాజరై, కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బానో మాట్లాడుతూ.. సరైన సమయంలో స్పందించడం, సమస్యలను పంచుకోవడం మరియు మానసిక సమస్యలపై ఉన్న అపోహలను వీడడం ద్వారా ఆత్మహత్యలను పూర్తిగా నివారించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం మరియు వందలాది మంది విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. మానసిక ఒత్తిడిలో ఉన్నవారికి అండగా ఉంటామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. సమస్యలు ఎప్పుడు శాశ్వతం కాదని చిన్నచిన్న మానసిక రుగ్మతలు ఎవరికైనా సర్వసాధారణమని అయితే విద్యార్థులు వాటిని తల్లిదండ్రులతో స్నేహితులతో కళాశాల అధ్యాపకులతో పంచుకోవాలని అప్పుడు వారు సరియైన మార్గాన్ని నిర్ణయాన్ని ఇస్తారని మీలో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తారని అన్నారు. విద్యార్థులలో పోరాట స్ఫూర్తి ఉండాలని అన్నారు.

కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతీయ ఇతిహాసాలలో జీవన విధానాలలో ఆత్మహత్యలు లేవని ప్రాచీన భారతీయులకు సమస్యలు వస్తే సన్యాసము స్వీకరించేవారని లేదా వైరాగ్యంతో తపస్సు చేసుకోవడానికి వెళ్లేవారని ఆ విధంగా వారి జీవితాన్ని ఉన్నతం చేసుకునేవారని అన్నారు. విదేశీ సంస్కృతల వలన ఆత్మహత్యలు అన్నవి వచ్చాయని, విద్యార్థులు ఆత్మవిశ్వాసముతో దృఢ సంకల్పముతో ముందుకు వెళ్లాలని స్వామి వివేకానంద చెప్పినట్లుగా మానసిక దౌర్భాల్యం విడనాడాలని సత్ప్రవర్తనతో మానసిక వికాసంతో విద్యను అభ్యసించినప్పుడు ఆ విద్య సరియైన మార్గాన్ని ఏర్పరుస్తుందని చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని హితవు పలికారు.

కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కేబీవి సుబ్బయ్య మాట్లాడుతూ విద్యార్థులు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యల ఆలోచనలను విడనాడాలని ఆత్మహత్యల నివారణ అవగాహన కొరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.డీన్ ఆఫ్ అకాడమిక్స్ శ్రీమతి ప్రగతి మేడం మాట్లాడుతూ విశాల ప్రపంచంలో అనేకమైన సదుపాయాలు మార్గాలు ఉన్నాయని వాటిని సరైన పద్ధతిలో ఎన్నుకొని ముందుకు వెళ్లాలని మనం ఆత్మహత్య చేసుకోవడం వలన మన చుట్టూ ఉన్న ప్రపంచము ఏమీ మారదని కాకపోతే మనలను కన్న తల్లిదండ్రులకు జీవితాంతం వేదనను మిగిల్చిన వారము అవుతామని హితవు పలికారు.కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ముఖ్యఅతిథి డాక్టర్ ఆరిఫా బానో ను మెమెంటో శాలువాతో ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొని జయప్రదం చేశారు.జాతీయగీతంతో కార్యక్రమం ముగిసింది.
Arattai