నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యక్తిత్వ వికాస అవగాహన కార్యక్రమం
NANDYAL Sep10 :- నంద్యాల జిల్లా కేంద్రంలోని PSC & KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ శశికళ అధ్యక్షతన వ్యక్తిత్వ వికాస అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మానసిక వికాస నిపుణుడు బాలాజీ సింగ్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం మీద అవగాహన కల్పించారు.

200 మంది విద్యార్థులకు మానసిక కృంగుబాటు మరియు ఆందోళనకు గల కారణాలను వాటికి పరిష్కారాలను తెలియజేశారు. అనంతరం సైకాలజిస్ట్ బాలాజీ సింగ్ గారిని ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ ఎన్.ఎస్.ఎస్. ఆఫీసర్ సంజయ్ కుమార్, విజయానంద్, రమేష్ కుమార్ లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Arattai