ఈనెల 13న సాయిబాబా దేవాలయం నందు ఉచిత వైద్య శిబిరం
NANDYAL Sep10 :- నంద్యాల పట్టణం నాగులకుంటలో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం నందు ఈనెల 13వ తేదీ ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఓం శ్రీ షిరిడి సాయిబాబా సేవ సమితి సభ్యులు శ్రీ రామ మూర్తి, రామలింగారెడ్డి లు తెలిపారు.

ఈ వైద్య శిబిరంలో నంద్యాల పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ గెలివి సహదేవుడు డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ హరిత డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి డాక్టర్ విజై బాబు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డిలు పాల్గొని తమ సేవలను అందిస్తారని తెలిపారు
Arattai