ఏకశిల అభయాంజనేయ స్వామికి శ్రావణ మాస అమావాస్య పూజలు
NANDYAL Sep11:- నంద్యాల జిల్లా,బండి ఆత్మకూరు మండలం, పెద్ద దేవలాపురం గ్రామంలోని ఏకశిలా అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు శుక్రవారం శ్రావణ మాస అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.ఏకశిలా అభయాంజనేయ స్వామికి ఆకు పూజలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు,భజనలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శివరాజ్ యోగి, రవితేజ తెలిపారు. అర్ధరాత్రి ఒంటి గంటకు మహా మంగళహారతి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు
Arattai