శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం నందు సుదర్శన యాగం
NANDYAL Sep11:- నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం నందు శుక్రవారం అమావాస్య సందర్భంగా వర్షాలు కురవాలని కోరుకుంటూ సుదర్శన యాగం నిర్వహించారు.దేవస్థానం చైర్మన్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున నిజరూప దర్శన ఆంజనేయస్వామి కి ప్రత్యేక అభిషేకాలు,అనంతరం 8 గంటలకు లోక కళ్యాణార్థం,వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ,పండితులు రఘోత్తమ ఆచార్యుల ఆధ్వర్యంలో సుదర్శన యాగం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సుదర్శన యాగంలో పాల్గొన్నారు లోక కళ్యాణార్థం వర్షాలు కురవాలని కోరుకుంటూ ఈ యాగం నిర్వహించినట్లు తెలిపారుఅలాగే శనివారం ఉదయం 8 గంటలకు రామాలయం నందు స్వాముల వారికి అభిషేకము నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో దేవస్థానం చైర్మన్ అనిల్ కుమార్, కమిటీ సభ్యులు భారతి,పద్మావతి,జంబులయ్య,ఆది, ప్రధాన అర్చకులు సుబ్బయ్య శర్మ,శివ,దేవస్థానం సిబ్బంది అంజి పాల్గొన్నారు
Arattai