నంద్యాల RTC డిపోను సందర్శించిన ED కృష్ణ కిషోర్
NANDYAL Sep12 :- ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (జోన్–4, కడప) ఆర్.ఆర్. కృష్ణ కిషోర్ శనివారం నంద్యాల ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా డిపో గ్యారేజీ, బస్‌స్టేషన్‌ను పరిశీలించి, అక్కడి నిర్వహణ, సౌకర్యాలను సమీక్షించారు.

డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

బస్‌స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ జె. మాధవీలతను ఆదేశించారు. వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమం డిపో మేనేజర్ జె. మాధవీలత ఆధ్వర్యంలో జరిగింది.
Arattai