నంద్యాల జిల్లా యువజన ఉత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటాలి : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Sep :- నంద్యాల జిల్లా యువజన ఉత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా యువజన సంక్షేమ శాఖ–సెట్కూరు ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న నంద్యాల జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ యువత తమ ప్రతిభను ప్రదర్శించడానికి యువజన ఉత్సవాలు అద్భుత వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను చాటుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖాధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెల 30 న యస్.వి.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, నంద్యాలలో జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలు ఐదు విభాగాల్లో నిర్వహించబడతాయని..వీటిలో 1) జానపద నృత్యం (గ్రూప్), 2) జానపద గీతం (గ్రూప్), 3) నాటక్ నుక్కడ్ , 4) పెయింటింగ్ 5) కవితా రచన ఉన్నాయని సెట్కూరు సీఈఓ డా కె. వేణుగోపాల్ తెలిపారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారు జాతీయ స్థాయికి ఎంపికవుతారని తెలిపారు. విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, మరియు పాల్గొన్న కళాకారులకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు అందజేయబడతాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన యువతీ యువకులు తమ పేరు లేదా బృందం పేరును వెబ్ లింక్ https://bit.ly/ndldyf26 ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, ఆన్లైన్లో నమోదు చేసుకోలేని వారు సెప్టెంబర్ 30న ఉదయం 8.30 గంటలలోపు నేరుగా కళాశాలలో వచ్చి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు మొబైల్ నంబర్లు 92922 07601 లను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి సునీల్ సక్సెనా, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి సోమ శివా రెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ నాయక్, జిల్లా క్రీడల అధికారి రాజు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, మై భారత్ జిల్లా యువజన అధికారి ఐజయ్య, యస్.వి.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ రెడ్డి ప్రిన్సిపాల్ హరిప్రసాద్ రెడ్డి , సెట్కూరు పర్యవేక్షణ అధికారి శ్యామల పాల్గొన్నారు.
Arattai