AMARAVATHI Oct 24 : బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా బలపడనున్న నేపధ్యంలో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు
బంగాళాఖాతంలో అల్పపీడనం సోమవారంకు తుపానుగా బలపడనుండటంతో అప్రమత్తమైన ఏపి ప్రభుత్వం
విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఈడీ దీపక్, అధికారులతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి వంగలపూడి అనిత
అల్పపీడనం నైరుతి,పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సోమవారంకు తుపానుగా బలపడుతుందని తెలిపిన ఎండీ ప్రఖర్ జైన్

రాష్ట్రానికి రేపు భారీ, ఎల్లుండి అతిభారీ, సోమ,మంగళవారాల్లో అత్యంత భారీ వర్ష సూచన ఉందని వివరించిన అధికారులు
తుపాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలని అలెర్ట్ చేయాలి
ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశం
ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి : హోంమంత్రి వంగలపూడి అనిత

తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు, ప్రజలకు తెలియజేయాలి
సహయక చర్యలకు SDRF, NDRF బృందాలు పంపించండి
క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మరింత అలెర్ట్ గా ఉండాలి
కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి 24/7 కొనసాగించాలి
సోషల్ మీడియాలోని వదంతులు నమ్మవద్దు
విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రందించాలి

శిధిలావస్థలో ఉన్న ఇళ్ళల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలి
ఎక్కడిక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి మంచి ఆహారం అందించాలి
విరిగిన చెట్లు తొలగించడం , విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా ఉండాలి
బలమైన ఈదురుగాలుల వీచేప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండకండి
భారీవర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి

Arattai