నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సోమవారం AP Climate Action ఆధ్వర్యంలో జీవిత నైపుణ్యము మరియు కెరియర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు.
జర్మనీ దేశంలో సైంటిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ డి.సాయిరాం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జీవిత నైపుణ్యాలు, కెరీర్ గైడెన్స్ సబ్కాన్షియస్ మరియు డీప్ లర్నింగ్ పై అవగాహన కల్పించారు.విద్యార్థులు,అధ్యాపకుల బోధనలను ఏవిధంగా గుర్తు పెట్టుకోవాలో, పరీక్షలు ఏ విధంగా రాయాలో విద్యార్థులకు సూచించారు.

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ హైదరాబాద్ నందు రాష్ట్ర సలహా మండలి సభ్యుడైన గోస్పాడు వాసి అయినటువంటి బాల మద్దిలేటి మాట్లాడుతూ రైతు బిడ్డలైన కళాశాల విద్యార్థులు ఆర్గానిక్ ఫార్మింగ్ ను ఉపయోగించి మన పూర్వీకులు ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకునేవారో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ క్లైమేట్ యాక్షన్ కోఆర్డినేటర్ డాక్టర్ వి.రమేష్ కుమార్, అధ్యాపకులు శశికళ, పార్వతీ, వెంకటలక్ష్మి, విజయానంద్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 128 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Arattai