నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు నవంబర్ 30వ తేదీ ఆదివారం ఎండో క్రైనాలజిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి అధినేత డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ తెలిపారు.
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాల యందు వైద్య సేవలు అందించిన డాక్టర్ కె రవీంద్ర నాథ్ రెడ్డి నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యందుఈనెల 30వ తేదీ ఆదివారం అలాగే ప్రతినెల 1వ ,3వ ఆదివారాలు మరియు రెండవ శనివారం అందుబాటులో ఉంటారని తెలిపారు.
షుగర్, థైరాయిడ్, ఊబకాయంతో పాటు పిల్లలు హార్మోన్ సమస్యలకు వైద్య సేవలు అందిస్తారని డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు
ఈ అవకాశాన్ని నంద్యాల జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ నెరవాటి గగన్ లు ఈ సందర్భంగా కరపత్రాలను విడుదల చేశారు.
Arattai