సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో స్థానిక పరివర్తన లైఫ్ సెంటర్ హెచ్ఐవి బాలలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఐఎంఏ నంద్యాల మహిళా వైద్య విభాగం తరపున 25 వేల రూపాయల తో కొనుగోలు చేసిన 10 బెడ్స్ పరివర్తన లైఫ్ సెంటర్ నిర్వాహకులు అబ్రహం లింకన్ కు అందజేశారు.
పరివర్తన లైఫ్ సెంటర్ లో ఉన్న బాలలకు 25 వేల రూపాయల నూతన రెడీమేడ్ దుస్తులను శ్రీకరి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ విజయబాబు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస రావు, మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, కార్యదర్శులు డాక్టర్ సునీత, కోశాధికారి డాక్టర్ హరిత, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ తనూజ, అకాడమిక్ విభాగం కార్యదర్శి డాక్టర్ లలిత, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మాధవి మాట్లాడుతూ పలు సంవత్సరాలుగా పరివర్తన లైఫ్ సెంటర్ బాలలకు సహకారం అందజేస్తూ వస్తున్నామని, వైద్యుల సంఘం తరఫున హెచ్ఐవి అవగాహన సదస్సులు నిర్వహించడమే కాకుండా, హెచ్ఐవి బాధితులకు అవసరమైన సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అన్నారు.
సెంటర్ నిర్వాహకులు అబ్రహం లింకన్ వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.
Arattai