NEW DELHI Dec12:- ఢిల్లీలోని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి నివాసంలో శుక్రవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, యూనియన్ రాష్ట్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర టీడీపీ, ఇతర పార్టీల పార్లమెంట్ సభ్యులు పి.సి. గడ్డిగౌడర్, విశ్వేశ్వర హెగ్డే కాగేరి, ఆదిత్య ప్రసాద్, ఉజ్జ్వల్ దేవరావ్ నికమ్, దార్జీ షేరింగ్ లెప్చా, వినోద్భాయ్ చావ్డాలతో కలిసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి బ్రేక్‌ఫాస్ట్ ఇంటరాక్షన్ నిర్వహించారు.

కేంద్ర మంత్రులు, సహచర పార్లమెంట్ సభ్యులతో నా ఆహ్వానం మేరకు నా ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ ఇంటరాక్షన్ నిర్వహించే అవకాశం రావడం నా భాగ్యంగా భావిస్తున్నానని,నా ఆహ్వానం స్వీకరించి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కి విచ్చేసిన కేంద్ర మంత్రులు, తోటి పార్లమెంట్ సభ్యులకు, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు.

Arattai