పత్తి పరిశోధనలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విశ్రాంత శాస్త్రవేత్త డా.కాదర్ బాద్ రవీంద్రనాథ్ 91వ జన్మదిన వేడుకలు నంద్యాల పట్టణంలోని భారతీ సీడ్స్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
మాతృభాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు డా.దీవి హయగ్రీవాచార్యులు, నంది రైతు సమాఖ్య అధ్యక్షులు రామసుబ్బారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన రవీంద్రనాథ్ జన్మదిన వేడుకల కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హయగ్రీవాచార్యులు మాట్లాడుతూ డా.రవీంద్రనాథ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పత్తి శాస్త్రవేత్తగా వివిధ హోదాలలో సేవలందించారని బ్రహ్మ, నరసింహ వంగడాల సృష్టికర్తగా, రైతు బాంధవుడిగా ఆయన పేరుగాంచారని కొనియాడారు.
శాస్త్రవేత్త రవీంద్రనాథ్ మాట్లాడుతూ గాంధేయవాదిగా పేరుగాంచిన తమ తండ్రి కాదర్ బాద్ నరసింగరావు నంద్యాల పట్టణ ప్రథమ మున్సిపల్ చైర్ ఫర్సన్ గా సేవలందించారని గుర్తు చేశారు. ఆయన సేవాస్ఫూర్తి తమకు మార్గదర్శకమన్నారు. నంది రైతు సమాఖ్య గౌరవ సలహాదారులుగా 25సం.లు అవిశ్రాంతంగా సేవలందించడం శ్లాఘనీయమన్నారు. పత్తి పరిశోధన జీవిత సాఫల్య అవార్డుతో పాటు ‘భారతీయుడు’లాంటి ఎన్నో పురస్కారాలు ఆయన సాధించి నంద్యాల కీర్తిని ఇనుమడింపజేశారన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాల ప్రతినిధులు శాలువాలు,పూలమాలలతో డా.రవీంద్రనాథ్ ను సత్కరించారు.
కార్యక్రమంలో బ్రాహ్మణసేవా సమాఖ్య ప్రతినిధులు మురళీకృష్ణ, కేశవమూర్తి, శ్రీనిధి రఘువీర్ , రామచంద్రమూర్తి, వివిధ సాహితీ సంఘాల నాయకులు అన్నెం శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసమూర్తి, అవ్వారి శేషఫణి, డా.కిషోర్ కుమార్, డా.నీలం వెంకటేశ్వర్లు, రోటరీ క్లబ్ ప్రతినిధులు డి.వి సుబ్బయ్య, ప్రసాద్ , కవి నీలకంఠమాచారి, శాస్త్రవేత్త మాధవస్వామి, రైతు నాయకులు కృష్ణారెడ్డి,జయరామిరెడ్డి,ఓబుళపతి, హరినాథరెడ్డి,రామకృష్ణారెడ్డి,చంద్రశేఖరరెడ్డి, కార్యాలయ సిబ్బంది శ్రీనివాసరెడ్డి, బాలచంద్రడు,హుస్సేన్ పాల్గొన్నారు.
Arattai