NANDYAL JAN 08:- నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎన్ శశికళ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రంగవల్లి (ముగ్గులు) పోటీలు నిర్వహించబడ్డాయి. విద్యార్థినులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించారని,అందమైన రంగులు, సంప్రదాయ డిజైన్లతో నిండిన రంగవల్లులు కళాశాల ఆవరణను మరింత రంగురంగులుగా మార్చాయని తెలిపారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. శశికళ మాట్లాడుతూ, “సంక్రాంతి సంబరాలు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూనే విద్యార్థుల్లో సృజనశీలతను పెంపొందిస్తాయ. రంగవల్లి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శన చేశారు” అని తెలిపారు.

మహిళా సాధికారత విభాగం సమన్వయకర్త డాక్టర్ ఆర్. శశికళ మాట్లాడుతూ, “ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా మహిళా అధ్యాపకులు వ్యవహరించి విజయవంతం చేశారని,ఇటువంటి కార్యక్రమాలు మహిళల సాధికారతను ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు.
ఈ సంబరాలు విద్యార్థుల్లో పండుగ ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, సాంప్రదాయ కళలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు.
Arattai