NANDYAL :-నంద్యాల పట్టణంలో పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలను కోరుతూ సోమవారం PGRS కార్యక్రమంలో,ప్రజలకు ప్రభుత్వానికి వారధి
బీజేపీ జనతా వారధి నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో DRO రాము నాయక్ కు వినతి పత్రం అందజేశారు.పట్టణంలో ప్రధాన సెంటర్లలో పబ్లిక్ టాయిలెట్లు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు,ప్రధాన కార్యదర్శి కశెట్టి చంద్రశేఖర్ తెలిపారు.అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు

ఈ సందర్భంగా నంద్యాల జిల్లా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రతి రోజు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వారి పని నిమిత్తం నంద్యాలకు అన్నిరకాల పనుల కొరకు వస్తూ వుంటారని,ప్రభుత్వం మౌళిక వసతులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత వుందని,ముఖ్యంగా గాంధీచౌక్ నుంచి శ్రీనివాస సెంటర్ వరకు, శ్రీనివాస సెంటర్ నుంచి పద్మావతి నగర్ ఆర్చీ వరకు, పద్మావతి నగర్ ఆర్చీ నుంచి మున్సిపల్ ఆఫీసు వరకు, మున్సిపల్ ఆఫీసు నుండి ఆర్.టి.సి. బస్టాండ్ వరకు, పద్మావతి నగర్ ఆర్చీ నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరకు, ముఖ్యంగా మహిళలు మూత్ర విసర్జన చేయడానికి కనీసం మౌళిక వసతులు లేవని తెలిపారు. ప్రతిరోజు కొన్ని వేల మంది వారి పనుల నిమి త్తం నంద్యాల దానికి వచ్చి వెళ్తుంటారని,కనీస సదుపాయం టాయ్లెట్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు.

అలాగే నంద్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, జనతా వారధి కన్వినర్ కశెట్టి చంద్ర శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు కో కన్వినర్ పసపుల రవీంద్ర, చాందిని, గోస్పాడు మండల అధ్యక్షులు తల్లారి మధు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బేక్కం నాగేశ్వర రెడ్డి, జిల్లా కార్యదర్శి కూరకు భరత్, జిల్లా కోశాధికారి పసపుల శివ సాయి,యూవ మోర్చా వంశీ,మల్లికార్జున పాల్గొన్నారు
Arattai