17 సంవత్సరంలోపు బాల బాలికలకు ప్రత్యేక విభాగాలలో
రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక
ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహించబోయే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 25 వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల కు రామకృష్ణ డిగ్రీ కళాశాల శ్రీ స్వామి వివేకానంద ఆడిటోరియం లో నంద్యాల జిల్లా స్థాయి 17 సంవత్సరముల లోపు బాల బాలికలకు వేరు వేరు విభాగాలలో చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్.రవికృష్ణ,కార్యదర్శి రామసుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 24 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఏపీ చెస్ వెబ్ సైట్ లో ఎంట్రీలు నమోదు చేసుకోవాలని,నంద్యాల జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు త్వరలో జరగబోవు రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9010451585.
Arattai