నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు కళాశాల ప్రిన్సిపల్ శశికళ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళాశాల యందు జనవరి నెల యొక్క ప్రత్యేకత అయినటువంటి జీరో గ్యాప్ శానిటైజేషన్ అనే అంశం పైన విద్యార్థులకు మరియు టీచింగ్ నాన్ టీచింగ్ సభ్యులందరికీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమం నందు కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు శశికళ మాట్లాడుతూ నిరంతరము పారిశుద్ధ్య పనులను సక్రమంగా చేసుకోవడం ద్వారా పరిసరాలను మనము పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందని ఎలాంటి విరామం లేకుండా పరిశుద్ధ పనులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిర్వహించాలని అలాగే కళాశాల పరిసరాలను ప్రతి దినము మనము ఎలాంటి విరామం లేకుండా శుభ్రపరచుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధించవచ్చు అని ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు
అనంతరం కళాశాల అధ్యాపకులు మరియు అధ్యాపకర్తల సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు అందరూ కళాశాల ప్రాంగణాన్ని అలాగే తరగతి గదులను స్వచ్ఛందంలో భాగంగా శుభ్రపరచడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతినెల క్రమం తప్పకుండా నిర్వహించడం పట్ల కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్సిసి కళ మరియు స్వర్ణాంధ్ర కోఆర్డినేటర్ కే శ్రీనివాసులు అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai