నంద్యాల పట్టణం టేక్కే భరతమాత గుడి వీధిలోని యోగ చైతన్య కేంద్రం నందు భీష్మ ఏకాదశి పురస్కరించుకొని యోగా గురువు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి,శ్రీశైలం దేవస్థానముల ప్రవచనకర్త హైగ్రీవాచార్యులు పాల్గొన్నారు.భీష్మ పితామహుడు పాండవులకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించారని,ఈ స్తోత్ర పారాయణం అత్యంత శుభప్రదంగా భావిస్తారని హైగ్రీవాచార్యులు తెలిపారు.

విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించిన,విన్న, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని, సిరిసంపదలు కలుగుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని, గ్రహదోషాలు తొలగిపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగ చైతన్య సంస్థ సభ్యులు, యోగ సాధకులు భక్తులు పాల్గొన్నారు
Arattai