NANDYAL Jan30:- నంద్యాల పట్టణంలోని భారతి సీడ్స్ కార్యాలయంలో నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులు శాస్త్రవేత్తలు, కవులు… మహాత్మా గాంధీ చిత్రపటం ముందు పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళులర్పించారు. సమాఖ్య కోఆర్డినేటర్ ఓబులపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కాదర్ బాద్ రవీంద్రనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి పోరాడారని ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా తదితర ఉద్యమాల ద్వారా భారత స్వాతంత్ర పోరాటానికి దిశా నిర్దేశం చేశారని పేర్కొన్నారు.. స్వాతంత్రోద్యమ కాలంలో తమ తండ్రిగారైన కాదరబాద్ నర్సింగరావు గారు మహాత్మా గాంధీ నంద్యాల పర్యటనకు విచ్చేసినప్పుడు జన సమీకరణతో పాటు బహిరంగ సభ ఏర్పాట్లు చేశారని గుర్తు చేశారు.. సత్యం, స్వదేశీ, స్వచ్ఛత, సామాజిక సమానత్వం తదితర అంశాలలో భారత జాతిని ప్రభావితం చేశారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు కేశవమూర్తి, మురళీ కృష్ణారావు, డాక్టర్ కిషోర్ కుమార్, మాధవస్వామి, మహమ్మద్ రఫీ కార్యాలయ సిబ్బంది శ్రీనివాస రెడ్డి, బాలచంద్రుడు ,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Arattai