NANDYAL Feb12:- నంద్యాల పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న,శిరిగిరి వెంకప్ప పంచకర్మ ఆయుర్వేద వైద్యశాల నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మనాభ రెడ్డి, సీనియర్ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ యశోదర, నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ DEMO పామన్న, మున్సిపల్ సీనియర్ సానిటరీ సూపర్వైజర్ మురళీధర్, డాక్టర్ గెలివి సహదేవుడు లైన్స్ క్లబ్ సభ్యులు నాగరాజు జనార్ధన్, కన్నయ్య శిబిరం నిర్వాహకులు సిరిగిరి రమేష్ పాల్గొన్నారు.

సిరిగిరి వెంకప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యులు పద్మనాభరెడ్డి, వైద్యురాలు శ్రావణ సంధ్య సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సిరిగిరి రమేష్ మాట్లాడుతూ చర్మ వ్యాధులు,ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించి,JRC’s సహకారంతో ఉచితంగా మందులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.వైద్యురాలు శ్రావణ సంధ్య మాట్లాడుతూ వైద్య శిబిరానికి కొనసాగింపుగా ఈనెల 21వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Arattai