NANDYAL Mar20 :- అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో పిచ్చుకల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత శాస్త్రవేత్త శ్రీ కాదర్ బాద్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ పిచ్చుకలు రేడియేషన్ ద్వారా అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పిచ్చుకలు పంటలకు హాని చేసే పురుగులను అరికట్టి రైతులకు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. పిచ్చుక జాతి సంరక్షణకు సంబంధించి జీవశాస్త్రవేత్తలు, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.దంత వైద్యులు డా “కె.కిశోర్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లో పిచ్చుకలు ప్రముఖ పాత్ర వహిస్తాయని, వేసవిలో ప్రతి ఇంటి ముందు నీటి తొట్టి ఉంచి పక్షులను ఆదుకొనాలని కోరారు.
రైతు సమాఖ్య కో ఆర్డినేటర్ ఓబులపతి మాట్లాడుతూ జీవవైవిధ్యం లో పిచ్చుకలు ప్రముఖ పాత్ర వహిస్తాయని తెలిపారు. కవి నీలకంఠమాచారి పిచ్చుకల పరిరక్షణ గురించి కవితా గానం మధురంగా వినిపించారు.మహమ్మద్ రఫీ మాట్లాడుతూ మొక్కలు విరివిగా నాటి పిచ్చుకలకు ఆవాసాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుసేన్, లక్ష్మయ్య, శ్రీనివాస రెడ్డి ,బాల చంద్రుడు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Arattai