NANDYAL Mar31:- నంద్యాల పట్టణం అమ్మవారి శాల,గీతా భవన్ నందు మంగళవారం జ్ఞాన ప్రసాద్ గురువు చే సప్తాహ భక్తి వైభవం ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు.జీవితం బాగుండాలంటే జీవించే యోగ్యత ఉండాలని, ఆ యోగ్యత భక్తి ద్వారా వస్తుందని జ్ఞాన ప్రసాద్ గురూజీ తెలిపారు.

మనలోని భగవత్ తత్వాన్ని కనుగొని, ఆ భగవంతునితో ఉండడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.నిర్వాహకులు తిమ్మయ్య,రామకృష్ణ,గాంధీ,అనిల్ పాల్గొన్నారు
Arattai