NANDYAL April 04:- ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు ఉచితంగా ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమసంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ భీమనపల్లె వెంకట సుబ్బయ్య ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేశారు.రాష్ట్రంలో 93 వేల చేనేత కుటుంబాలకు,11488 మరమగ్గాల యూనిట్ల వెరసి 1,04,488 మంది నేతన్న లకు ఈ ఉచిత విద్యుత్తు పథకం అమలవుతుందన్నారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు.
ఇప్పటికే చేనేత పెన్షన్ల ద్వారా రాష్ట్రంలో 92,724 మంది మందికి ప్రతినెల 4000 రూపాయలు లబ్ధి చేపడుతుందని గుర్తు చేశారు.
త్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కింద ప్రభుత్వ వాటా 8శాతం నుంచి 16% పెంచడం జరిగిందని,ఇందు కొరకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగిందన్నారు.జాతీయ చేనేత అభివృద్ధి పథకం ద్వారా 38 కోట్ల 31 లక్షలతో ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా హర్ష వ్యక్తం చేసారు.
ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద రాష్ట్రానికి 10 అవార్డులు వస్తే అందులో 4 అవార్డులు చేనేత రంగానికి దక్కటం కూటమి ప్రభుత్వ పనితనానికి నిదర్శనం అన్నారు.ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి కూటమి ప్రభుత్వానికి చేనేత వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం..రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉపముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మాత్యులు మంత్రివర్యులు మాన్యశ్రీ నారా లోకేష్ బాబు గారికి, చేనేత మంత్రివర్యులు మాన్యశ్రీ శ్రీమతి సవితమ్మ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలియ సంక్షేమ సంఘం గౌరవ సలహాదారులు శ్రీ చెన్నా వెంకటేశ్వర్లు గారు పుత్త రామకృష్ణ గారు గాజుల శంకర్ గారు ప్రధాన కార్యదర్శి ఉద్దంటి వెంకట సతీష్ గారు కార్యదర్శి గుద్దేటి వెంకటరామయ్య గారు గాజుల బ్రహ్మయ్య చేపూరి మురళి చింతలపల్లె వాసు సాదు సూర్యనారాయణ మద్దాల మోహన్ సింగరి సురేష్ మరియు మహిళ సభ్యులు జింక రాజేశ్వరి కోటా నాగరత్నమ్మ శోభారాణి మరియుకుల బాంధవులు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
Arattai