NANDYAL May01:- నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మే డే సందర్భంగా,నంద్యాల పట్టణంలోని మహాలక్ష్మి సైకిల్ మార్ట్ నందు గత 30 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న షేక్ అలీషా,షేక్ అన్వర్ భాష,షేక్ చాంద్ బాషా,షేక్ రఫీ లను ఘనంగా సత్కరించారు.గత 30 సంవత్సరాలకు పైగా ఒకే సంస్థలో నిబద్ధతతో పనిచేస్తున్నామని, తమ కృషిని గుర్తించి మే డే రోజు సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని కార్మికులు తెలిపారు.

సమాజ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని,వారి కృషిని గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి సైకిల్ మార్ట్ అధినేత పవన్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశుల నాగరాజు,క్లబ్ సభ్యులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు
Arattai