NANDYAL:- నంద్యాల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ (సివిఏపియు) కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెప్మా మరియు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్ కార్ట్ ల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన స్వయం ఉపాధి పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు మంత్రి ఫరూక్ ‘ఎగ్ కార్ట్’ లను పంపిణీ చేశారు

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు మరియు మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ ఎగ్ కార్డ్ ల ద్వారా లబ్ధిదారులు స్వయం ఉపాధి పొంది తమ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని అన్నారు

ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, సిటీ మిషన్ మేనేజర్ భాస్కర్ రెడ్డి, యంగ్ ప్రొఫెషనల్ చెన్నయ్య, మున్నా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. V రాజేంద్ర కుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai