NANDYAL :- ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహించబోయే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 10 వ తేదీ , ఆదివారం ఉదయం 9 గంటల కు టెక్కే లో భరతమాత గుడి ఎదురుగా ఉన్న నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో నంద్యాల జిల్లా స్థాయి టీం విభాగం పురుషులు మరియు మహిళలకు ప్రత్యేక విభాగాలలో చెస్ పోటీలు ఎన్.ఆర్.జి. చెస్ అకాడమీ గౌరవ అధ్యక్షులు రాజేష్, కె.వి.ఆర్ హాస్పిటల్ ప్రముఖ ఎముకల, కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.రాజశేఖర్ రెడ్డి, నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ ఆనంద గుప్తా, కరస్పాండెంట్ కృష్ణ సాయి రోహిత్ ల సహకారంతో నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు, ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ డాక్టర్.జి.రవికృష్ణ,కార్యదర్శి రామసుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 8 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఏపీ చెస్ వెబ్ సైట్ లో ఎంట్రీలు నమోదు చేసుకోవాలని,నంద్యాల జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు మే నెలలో బాపట్లలో జరగబోవు రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలలో పాల్గొంటారని తెలిపారు
ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9010451585.
Arattai