NANDYAL May12:- విమానాశ్రయంలా నంద్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధి చేశామని, మరింత ఆధునికరించి రైలు ప్రయాణికులకు ఆధునిక వసతి, తక్కువ చార్జీ, సురక్షిత ప్రయాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని, నంద్యాల జిల్లా రైలు ప్రయాణికుల చిరకాలిక స్వప్నం నంద్యాల నుంచి గుంతకల్లుకు పగటిపూట రైలును నేడు ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

మంగళవారం నంద్యాల రైల్వే స్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డి ఆర్ ఎం సుధేష్టసేన్ తో కలిసి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గుంతకల్లు వయా నంద్యాల మీదుగా మార్కాపురం రోడ్డు వరకు నూతన ఫ్యాసింజర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్బంగా రైల్వే స్టేషన్ లో రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన నూతన రైలు ప్రారంభ సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రజలు అమ్మా నంద్యాల నుంచి గుంతకల్లు వైపు పగటిపూట ఒక్క రైలు లేదు, అన్ని రైళ్లు అర్ధరాత్రి ఉన్నాయి ఎలాగైన్ పగటి పూట ఫ్యాసింజర్ రైలు నడిచేలా చూడాలని వినతి పత్రాలు ఇచ్చారని, ప్రజల వినతిని తాను పార్లమెంట్ లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీవైష్టవ్ దృష్టికి తీసుకెళ్లగా ఒక్క క్షణం ఆలోచించ కుండా మీ విన్నపంను త్వరలో కార్యరూపం ధాలుస్తానని, వెంటనే రైల్వే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, దక్షిణ మధ్య రైల్వే శాఖ ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించి నేడు నూతన రైలును ప్రారంభించుకుంటున్నామని, నంద్యాల జిల్లా ప్రజల తరుపున కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్ కు, దక్షిణ మధ్య రైల్వే శాఖ ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలుపుతున్నామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

నంద్యాల మీదుగా అజ్మీర్, శబరి మల, కడప ఇస్తేమాలకు ప్రత్యేక రైళ్లు వేయించామని, రైలు ప్రయాణికుల కోరిక మేరకు నంద్యాల మీదుగా మరి కొన్ని రెగ్యులర్ రైళ్లు నడిసేలా చూస్తామని, నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల, బేతంచెర్ల, డోన్ రైల్వే స్టేషన్లలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి నూనెపల్లి రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణం భూసేకరణ సమస్య వివరించగా తప్పకుండా చేద్దాం అన్నారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు
కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే రూ. 24 కోట్లతో నంద్యాల రైల్వే స్టేషన్ ఆధునికరణ పనులు జరుగుతున్నాయని, నంద్యాలకు రైల్వే గూడ్స్ స్టేషన్ కొత్తగా మంజూరు అయిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రకటించారు. నంద్యాలకు ఫిట్ లైన్ మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వంను కోరామని, దశలవారీగా అన్ని రైల్వే సమస్యలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీ అందరి సహకారంతో సాధించుకుంటాం అన్న నమ్మకం ఉందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు, రైల్వే శాఖకు వారధిగా ఉంటున్న నంద్యాల, మార్కాపురం జిల్లాల రైల్వే డివిజనల్, జోనల్ జడ్ ఆర్ సి సి సభ్యులు నారాయణ రెడ్డి, వెంకట రంగయ్య, జిన్ను ప్రసాద్ రెడ్డి, నాగేశ్వరావు, అమీర్ బాషా, జుబేర్ బాషా లను డి ఆర్ ఎం, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డి సి ఎం డాక్టర్. ప్రదీప్, సీనియర్ డి పి ఓ క్యాప్తర్ ఆరోరా తదితరులు పాల్గొన్నారు.
Arattai