NANDYAL May29:- నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలో 1994-1997 బ్యాచ్ BA Hep పూర్వ విద్యార్థుల సమ్మేళనం శుక్రవారంఅత్యంత వైభవంగా జరిగింది.కోర్సు పూర్తి చేసి 29వసంతాలు పూర్తయిన సందర్భంగా, పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈ “రజతోత్సవ వేడుకలు” నిర్వహించారు.

పూర్వ విద్యార్థులు సంఘం నాయకులు కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శ్రీరామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.

కార్యక్రమంలో డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నప్పుడు అది విద్యాసంస్థకు, గురువులకు గర్వకారణమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో శ్రమించి నేడు వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

అదేవిధంగా కళాశాల నందు విద్య అభ్యసించి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ఉన్నత స్థానంలో ఉన్న కళాశాల పూర్వ విద్యార్థులతో ఒక యూనియన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుందన్నారుతమకు విద్యాబుద్ధులు నేర్పించి, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి పునాదులు వేసిన ఆనాటి అధ్యాపకులను విద్యార్థులు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు

దాదాపు 30 ఏళ్ల తర్వాత తర్వాత తమ క్లాస్‌మేట్స్‌ను కలుసుకోవడంతో కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆనాటి కాలేజీ రోజులను, తీపి జ్ఞాపకాలను విద్యార్థులు ఒకరితో ఒకరు పంచుకున్నారు. పాత మిత్రులను చూసి మురిసిపోతూ, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణ విద్యాసంస్థల అధ్యాపక బృందం, 1994-1997 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai