NANDYAL June1:- నంద్యాల పట్టణంలోని సంజీవనగర్కు చెందిన “పబ్బు తులసికృష్ణ పద్మశాలీయ సేవా ట్రస్టు” (రిజిస్ట్రేషన్ నెం. 63/2016) ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ఉచితంగా ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేయనున్నట్లు ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పబ్బు తులసికృష్ణ తెలిపారు.
2016వ సంవత్సరం నుండి నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో భాగంగా, ఈ విద్యా సంవత్సరం కూడా 10వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణులైన పద్మశాలీయ విద్యార్థిని, విద్యార్థులకు చెరో 6 నోట్ పుస్తకాలను ట్రస్టు ద్వారా ఉచితంగా అందజేయనున్నామని తెలిపారు.

08-06-2026 వ తేదీ నుండి 30-06-2026 వరకు (ఆదివారము మినహా).సమయం: ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు. నంద్యాల పట్టణం.బోల్డెద్దుల వీధి
ప్రియ మహేష్ టెక్స్టైల్స్, డోర్ నెం. 15/21,నందు పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు

ఈ ఉచిత నోట్ పుస్తకాలను పొందగోరే అర్హులైన విద్యార్థులు తమతో పాటు ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరియు మార్కుల లిస్టు (Marks List) తప్పనిసరిగా తీసుకురావాలని ట్రస్టు నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్: 9866008860. అర్హులైన పద్మశాలీ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai