NANDYAL June03:- యోగ డే సందర్భంగా యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ నంద్యాల జిల్లా కార్యవర్గ సమావేశం ఈనెలమూడవ తేదీన శాంతినికేతన్ స్కూల్ నందు జరిగినది . ఈ సమావేశంలో రాష్ట్ర YSA ఉపాధ్యక్షులు బాలసుబ్రమణ్యం అధ్యక్షతన జరిగినది ఈ సమావేసానికి నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షునిగా శాంతినికేతన్ విద్యాసంస్థల అధినేత సుధాకర్ జిల్లా అధ్యక్షులు తుమ్మల పుల్లయ్య జిల్లా సెక్రటరీ జి రమేష్ ఉపాధ్యక్షులు ఉమామహేశ్వర్ కే జగదీష్ కోశాధికారి రహమాన్ గీతాంజలి పృధ్వీరాజ్,శ్రీనివాసులు , ముఖ్యఅతిథి కర్నూలు జిల్లా సెక్రటరీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా YSA రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ యోగా సనాతన ధర్మంలో ఒక భాగం అయినది విద్యార్థులకు యోగ అనేది మానసికంగా శారీరకంగా అభివృద్ధికి ఉపయోగపడుతుంది యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అనేది భారత రాష్ట్ర ప్రభుత్వము గుర్తింపు పొందిన సమస్త కావున స్పోర్ట్స్ కోటాలో ఈ సర్టిఫికెట్ కు రిజర్వేషన్ కూడా లభిస్తుంది అని తెలిపారు అధ్యక్షులు పుల్లయ్య మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో గల అన్ని ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలలో వారంలో ఒకరోజు యోగా తరగతులు నిర్వహించాలని YSA రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు జూన్ 21న అన్ని సంఘాల సహకారంతో యోగాడేను విజయవంతం చేయాలని నిర్ణయించడం మైనది అని తెలిపారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ యోగా కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవడానికి తమ వంతు సహకారం ఉంటుందని అలాగే తన విద్యా సంస్థలో యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ క్రీడాభారతి ఆధ్వర్యంలో అనేక యోగ కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు యోగా అనేది ప్రతి విద్యార్థికి జీవన విధానమని కావాలని కోరారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai