NANDYAL June05:- ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం (జూన్ 5) మహానంది రోడ్డులోని 10.90 MLD సామర్థ్యం గల రక్షిత నీటి సరఫరా కేంద్రం (ఫిల్టర్ బెడ్స్) ప్రాంగణంలో “హరితాంధ్ర కార్యక్రమం 2026-2027” ను ఘనంగా నిర్వహించారు. ఈ పర్యావరణ పరిరక్షణ మరియు మొక్కలు నాటే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ “ప్రకృతి స్ఫూర్తితో – వాతావరణ రక్షణకై – భవిష్యత్తు భద్రత కోసం” ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని, కాలుష్య రహిత సమాజ స్థాపనకు మరియు భావితరాల మనుగడకు ప్రతి పౌరుడు మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని కోరారు. అనంతరం ఆయన అధికారులతో మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రక్షిత నీటి సరఫరా కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న , ఎమ్మార్వో శ్రీనివాసులు, ఫుడ్ కమిటీ మెంబర్ విశ్వనాథరెడ్డి, డిలీట్ హోటల్ అధినేత ఫిరోజ్ మరియు ప్రజా ప్రతినిధులు, పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai