ఏకశిలా ఆంజనేయస్వామి కి వైశాఖ అమావాస్య పూజలు
NANDYAL :- నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురం నందు వెలసిన శ్రీ ఏకశిల హనుమాన్ దేవస్థానం నందు వైశాఖ అమావాస్య మరియు శనీశ్వర జయంతి సందర్భంగా.ఏకశిలా అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు,ఆకు పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.సాయంత్రం భజన, సాంస్కృతిక కార్యక్రమాలు అర్థరాత్రి రెండు గంటలకు మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శివరాజ్ యోగి, రవితేజ లు తెలిపారు. ప్రతి నెల అమావాస్య రోజున ఏకశిలాభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు
Arattai