NANDYAL June08:- ఆటో నగర్ కార్మికులకు స్థలాల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ ఆరోపిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కార్మికులతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. భూమ బ్రహ్మానంద రెడ్డి ఆటోనగర్ కార్మికులు పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు . న్యాయం చేసేంతవరకు కదిలేది లేదంటూ భీష్ముంచుకొని కూర్చున్నారు .దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఆటో నగర్ కార్మికుల నిరసనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆటో నగర్లో కార్మికులకు స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, తమను మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఆటో నగర్ ప్రెసిడెంట్ జాకీర్పై చీటింగ్ కేసు నమోదు చేసే వరకు ఇక్కడి నుంచి కదలబోమంటూ కార్మికులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్ ముందు పెద్ద సంఖ్యలో కార్మికులు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.కార్మికుల ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చినప్పటికీ భూమా బ్రహ్మానందరెడ్డి వినక పోవడం తో మొదట తాలూకా ఎస్సై గంగయ్య యాదవ్ ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ సిఐ కృష్ణయ్య నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. చివరికి బాధితుల ఫిర్యాదు మేరకు ఆటోనగర్ జాకీర్ కమిటీ సభ్యులపై చీటింగ్ కేసు నమోదు చేయడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెనితిరిగారు.
రాజేంద్ర కుమార్,నంది న్యూస్ రిపోర్టర్
Arattai