NANDYAL June15:- నంద్యాల జిల్లా పెద్ద దేవలాపురంలోని ఏకశిలా అభయాంజనేయ స్వామికి సోమవారం సోమావతి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి ఆకు పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శివరాజ్ యోగి, రవితేజలు తెలిపారు. అర్ధరాత్రి 2 గంటలకు మహా మంగళహారతి జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు భారీగా ఆలయానికి చేరుకొని స్వామిని దర్శించుకున్నారు.
Arattai