NANDYAL June 18, :- నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా,గురువారం ప్రోటోకాల్ యోగ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ శశికళ ఆధ్వర్యంలో నిర్వహించారు.యోగా- న్యాచురోపతి డాక్టర్ గుమ్మడి రామకృష్ణారెడ్డి విద్యార్థులకు యోగ పై అవగాహన కలిగించారు.

ఆరోగ్యకరమైన ఆనందకరమైన సమాజాన్ని నిర్మించాలనేది,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆశయం అని తెలిపారు.ప్రతి ఒక్కరు యోగా చేయాలని,ఆరోగ్యంగా జీవించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమాన్ని వ్యాయామ విభాగాధిపతి కే శ్రీనివాసులు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రామలింగారెడ్డి మరియు విజయానంద్ అలాగే అధ్యాపక మరియు అధ్యాప కేతర అలాగే విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Arattai