NANDYAL June 18, :- నంద్యాల మాజీ పార్లమెంటు సభ్యులు,మాజీ కేంద్రమంత్రి, కర్ణాటక, బీహార్ రాష్ట్ర మాజీ గవర్నర్, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ పెండేకంటి వెంకట సుబ్బయ్య గారి 105 వ జయంతి సందర్భంగా నంద్యాల మాతృ భాషా పరిరక్షణ సమితి మరియు నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పెండేకంటి గారి చిత్ర పటమునకు రైతు సమాఖ్య అధ్యక్షులు శ్రీ బి.వి.సుబ్బారెడ్డి, ఆయుర్వేద వైద్యులు డా సి.”మధుసూధన శర్మ గార్లు మాలార్పణ కావించారు.అనంతపురం రచయిత్రి శ్రీమతి పాణ్యం (గొల్లా పిన్ని) వసుంధర గారు రచించిన మరియు శ్రీ గడ్డం నాగరాజు గారు ముద్రించిన రాజనీతి ఘనాపాటి శ్రీ పెండేకంటి పుస్తకంను విశ్రాంత శాస్త్రవేత్త శ్రీ కె.రవీంద్రనాథ్ గారు ఆవిష్కరించారు.

పెండేకంటి గారితో నంద్యాలకు ఉన్న అనుబంధాన్ని , ఈ ప్రాంత వాసులకు ఆయన చేసిన సేవలను కె.రవీంద్రనాథ్ , డా”మాధవ స్వామి,డా”మధుసూధన్ శర్మ, శ్రీ ఓబులపతి, శ్రీ పాణ్యం చంద్రశేఖర్ గార్లు వివరించారు.డా”గెలివి సహదేవుడు గారు పుస్తక సమీక్ష నిర్వహించారు.ఎర్రగుంట్ల -నంద్యాల రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేసిన శ్రీ పెండేకంటి గారి పేరు సంజామల స్టేషన్ కు పెట్టాలని, అలాగే 27 సం”లు నంద్యాల పార్లమెంటు సభ్యులుగా పనిచేసి యస్.ఆర్.బి.సి, షుగర్ ఫ్యాక్టరీ, విద్యాలయాలు స్థాపించిన పెండేకంటి విగ్రహం ను నంద్యాలలో ఏర్పాటు చేయాలని పలువురు వక్తలు కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీ యుతులు దీవి హయగ్రీవాచార్యులు,డా”కె.కిశోర్ కుమార్,గోళ్ళ సుదర్శనం, పుస్తక ముద్రకులు శ్రీ జి.నాగరాజు, చంద్రశేఖర రెడ్డి, క్రిష్ణా రెడ్డి,రఫీ,నీలకంఠమాచారి,చిత్తలూరి రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు
Arattai