NANDYAL July25 :- నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఈనెల 30వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.10వ తరగతి,ఐటిఐ,డిప్లొమా,ఇంటర్,డిగ్రీ,బిటెక్,పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.కావున జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినం చేసుకోవాలని కోరారు
ఈ జాబ్ మేళాకు 16 ప్రైవేట్ కంపెనీలు SCHNEIDER Electric Manufacturing, PITTI Engineering Pvt Ltd, ATHER, KIA India Pvt LTd, Hilton Tobacco, Apollo Pharmacies Ltd, AIL Dixon Technologies India Ltd, TATA Electronics (LMS), Muthoot Micro fin Ltd, Allied Integrated Security Services Pvt Ltd, L & T Constructions, Pacifi Engineering Surfaces Ltd, SSKG Business Service Pvt Ltd, Sujala Pipes, Hetero Labs, Usha International Limited చెందిన హెచ్ ఆర్ ప్రతినిధులు పాల్గొంటారని తెలియజేశారు.వీటికి సంబంధించిన ఇతర వివరముల కొరకు 6309679303, 8297812530 నెంబరుకు లేదా naipunyam.ap.gov.in సంప్రదించాలని తెలిపారు.
Arattai