నంద్యాల పట్టణంలో విశ్వ సంరక్షక మహాగణపతి
NANDYAL Sep14 :- నంద్యాల: నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌లో నిర్వాహకులు విశ్వ సంరక్షక మహాగణపతిని భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని గత 13 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రతి సంవత్సరం పర్యావరణహిత వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని వారు పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు.

ఈ ఏడాది ప్రత్యేకంగా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాలతో కూడిన విశ్వ సంరక్షక మహాగణపతిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాగణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించాలని వారు కోరారు.మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించడం ద్వారా చెరువులు, నదులు, జల వనరులు కాలుష్యం కాకుండా కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
Arattai