నంద్యాల లయన్స్ క్లబ్, ఐఎంఏ మహిళా విభాగం ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు
NANDYAL Aug 04 :- నంద్యాల లయన్స్ క్లబ్,ఐఎంఏ మహిళా విభాగం సంయుక్త నిర్వహణలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తల్లీ బిడ్డల ప్రత్యేక విభాగంలో మంగళ వారం తల్లి పాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ అధ్యక్షతన,నెరవాటి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ వినోద్,డాక్టర్ నెరవాటి అరుణ కుమారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ పద్మజ, చిన్నపిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ రవీంద్ర,ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, లయన్స్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ డాక్టర్ జి.రవికృష్ణ అతిధులుగా పాల్గొన్నారు.

తల్లిపాల విశిష్టత పై డాక్టర్ అరుణ కుమారి,డాక్టర్ పద్మజ , నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ రాజ్యలక్ష్మి,డాక్టర్ సుధా వాణి,డాక్టర్ వసుధ, ఐఎంఏ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య,నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, నంద్యాల మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ సునీత, డాక్టర్ రజని,డాక్టర్ ఫాతిమా,డాక్టర్ నిత్య, డాక్టర్ సహదేవుడు, డాక్టర్ తనూజ, డాక్టర్ అనూష గర్భవతులకు,చంటి బిడ్డల తల్లులకు తల్లిపాల వల్ల వచ్చే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ తల్లిపాల విశిష్టత పై గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.లయన్స్ క్లబ్ కార్య దర్శి మేడా చంద్రశేఖర్,కోశాధికారి సురేష్, జోన్ చైర్మన్ సోమేశుల నాగరాజు, సంయుక్త కార్యదర్శి అమిదేల జనార్ధన్, సభ్యులు పాలూరు ప్రశాంత్, కిరణ్, జగన్,తదితరులు పాల్గొని 200 మంది గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా తల్లీ పాల ఆవశ్యకత గురించి రూపొందించిన కర పత్రాలు విడుదల చేసి తల్లులకు గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేశారు.జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ, చిన్న పిల్లల వైద్య విభాగ వైద్యులకు, తల్లిపాల ప్రాముఖ్యతపై మాట్లాడిన వైద్యులకు లయన్స్ క్లబ్ జ్ఞాపికలు అందించి సత్కరించారు.
Arattai