నంద్యాలలో మల్లికార్జున స్వామికి సహస్ర ఘటాభిషేకం
NANDYAL Sep21 :- నంద్యాల పట్టణం గుడిపాడి గడ్డ లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు సోమవారం స్వామివారికి సహస్ర ఘటాభిషేకం, రుద్రాభిషేకం,వరుణ జపాలను ఘనంగా నిర్వహించారు.

అనావృష్టి పరిస్థితులు ఏర్పడిన సమయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ మల్లికార్జున స్వామివారికి జలాభిషేకం నిర్వహించడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోందని దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించి స్వామివారిని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో రైతులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం వర్షం కురవడంతో భక్తులు విశేషంగా భావించారు.
Arattai