AP-సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను క్రమంగా నిషేధించాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి

నంద్యాల, అక్టోబర్ 06:-స్వర్ణాంధ్ర–స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాను శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సత్సంకల్పంతో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. సోమవారం పీజీఆర్ఎస్ హాల్లో స్వచ్ఛ ఆంధ్రా అవార్డ్స్–2025 జిల్లా స్థాయి బహుమతుల ప్రధాన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, డీపీవో లలితాబాయి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డోన్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాజేష్, నంద్యాల ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్ తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జి. రాజకుమారి మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో నంద్యాల జిల్లాలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దే దిశగా ప్రతి ఒక్కరూ చురుకుగా పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని తీర్మానించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని క్రమంగా అమలు చేసి, తరువాత దాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని రెండవ తీర్మానంగా నిర్ణయించారు.

ద్రవ, ఘన వ్యర్థాలను వేరుగా వర్గీకరించేందుకు శ్రీకారం చుట్టాలని మూడవ తీర్మానంగా నిర్ణయించారు. జిల్లాలోని మెప్మా మరియు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోని మహిళా స్వచ్ఛంద సమూహాల ద్వారా ఇంట్లోనే చెత్తతో కంపోస్ట్ తయారీని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని నాలుగో తీర్మానం, నీటి మట్టాలు తగ్గిపోయిన 165 గ్రామాల్లో భూగర్భ జలాలను పునరుద్ధరించేందుకు ప్రత్యేక రీచార్జ్ నిర్మాణాలు చేపట్టాలని ఐదవ తీర్మానంగా సూచించారు.

జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో జిల్లా స్థాయి అవార్డులు సాధించిన సంస్థలు రాష్ట్రస్థాయి అవార్డులను లక్ష్యంగా పెట్టుకుని మరింత కృషి చేయాలని కలెక్టర్ కోరారు. రాష్ట్రాన్ని స్థిరమైన, సుస్థిరమైన, ఆరోగ్యకరమైన స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆమె గుర్తుచేశారు. ఇందులో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛంద్ర కార్యక్రమంగా నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెంచుతున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చెత్తను రోడ్లపై లేదా డ్రైన్లలో వేయకుండా సామాజిక ప్రదేశాల్లో స్వచ్ఛత పాటించాలని సూచించారు.

నంద్యాల జిల్లాలో 24 పర్యాటక కేంద్రాలు ఉన్నందున వాటిని పరిశుభ్రంగా ఉంచి పర్యాటకులకు ఆహ్లాదకర అనుభవం కలిగించేందుకు కృషి చేయాలని చెప్పారు. అదేవిధంగా స్మశాన వాటికల అభివృద్ధికి, వాటికి సరైన రహదారులు ఏర్పాటుకు కూడా చర్యలు చేపడతామని తెలిపారు. నంద్యాల మున్సిపల్ డంపింగ్ యార్డ్‌ 17 ఎకరాల్లో విస్తరించి ఉందని, ఇటీవల కాలంలో 6 వేల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించి 520 మొక్కలను నాటినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

అనంతరం, స్వచ్ఛ ఆంధ్రా అవార్డ్స్–2025 లో రాష్ట్ర స్థాయిలో “మన ఊరు – మన గుడి – మన బాధ్యత” స్వచ్ఛంద సంస్థ అవార్డు లభించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే, జిల్లాలో వివిధ విభాగాల్లో మొత్తం 51 అవార్డులు సాధించిన నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మేమెంటోలు, సర్టిఫికెట్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేసి, వారిని శాలువాలతో సత్కరించారు. జిల్లా స్థాయిలో అవార్డులు పొందిన సంస్థలు, విభాగాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్ (5): జూపాడుబంగ్లా, పాణ్యం, కోయిలకుంట్ల, బనగానపల్లి, ఉయ్యాలవాడ మండలాలు.

స్వచ్ఛత ఎన్జీవోలు (2): మహమ్మద్ రఫీ సోషల్ ఎన్జీవో, నంద్యాల నవనిర్మాణ సమితి.

AP-ఎపి సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా సాగిన మంత్రుల బృందం సమావేశం

స్వచ్ఛత బెస్ట్ వారియర్స్ (5): నంద్యాల, డోన్, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపాలిటీలు.

స్వచ్ఛ అంగన్వాడీలు (5): బండి ఆత్మకూరు, బొల్లవరం, చిన్నవంగలి, కాకనూరు, యాలూరు.

స్వచ్ఛ బస్ స్టేషన్: కోయిలకుంట్ల.

స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు (3): నీటి యాజమాన్య సంస్థ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం నంద్యాల, జలవనరుల శాఖ నంద్యాల.

స్వచ్ఛ గ్రామపంచాయతీలు (5): బనగానపల్లి, కోయిలకుంట్ల, కౌలూరు, పాండురంగాపురం, పాణ్యం.

స్వచ్ఛ ఆసుపత్రులు (3): బనగానపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డోన్ ఏరియా ఆసుపత్రి, గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్ ఆసుపత్రి బనగానపల్లి.

స్వచ్ఛ హాస్టల్స్ (4): సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ జూపాడుబంగ్లా, ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం గడివేముల, పోస్ట్ మెట్రిక్ బాలుర వసతిగృహం నంద్యాల, జిటిడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల బాలికల హాస్టల్ సున్నిపెంట.

స్వచ్ఛ పరిశ్రమలు (2): జయ జ్యోతి సిమెంట్ బనగానపల్లి, అగ్రి సోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉడుములపాడు (డోన్).

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు

స్వచ్ఛ పరిశ్రమలు (MSME) (3): ప్రేసీ ఫాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ బేతంచర్ల, నీలకంఠేశ్వర సీడ్ కార్పొరేషన్ చాబోలు, ఓం దుర్గా రైస్ మిల్ నందిపల్లె.

స్వచ్ఛ మున్సిపాలిటీ: నంద్యాల.

స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూల్: ఏపీ ఎస్‌డబ్ల్యూ ఆర్‌ఎస్ బాయ్స్ జూపాడుబంగ్లా.

స్వచ్ఛ రైతు బజార్: బనగానపల్లి రైతు బజార్.

స్వచ్ఛ పాఠశాలలు (5): మండల ప్రజా పరిషత్ ఎస్టీ స్కూల్ ఉమ్మాయిపల్లి, మండల ప్రజా పరిషత్ స్కూల్ దుద్యాల, పీఎం శ్రీ జడ్‌పిహెచ్‌ఎస్ స్కూల్ కొణిదెల, ఏపీ మోడల్ స్కూల్ రుద్రవరం, జడ్‌పిహెచ్‌ఎస్ గర్ల్స్ హైస్కూల్ కోయిలకుంట్ల.

స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్లు (5): బన్నూరు, బుక్కాపురం, ఉంగరానికుండ్ల, సిరివెళ్ల, వడ్లరామాపురం.

అనంతరం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛంద్ర సాధన కోసం కృషి చేసిన వారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేస్తున్న రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆంధ్రా అవార్డ్స్ – 2025 ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షించారు.