NANDYAL May18 :- గిరిజన మరియు వెనుకబడిన హ్యాబిటేషన్ల సమగ్ర అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలు లక్ష్యంగా జిల్లాలోని 14 మండలాల్లో ఎంపిక చేసిన 48 హ్యాబిటేషన్లలో మే 18 నుండి 25వ తేదీ వరకు జన్ – భాగిరదీ కార్యక్రమం నిర్వహించబడుతుందని కలెక్టర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కార్యక్రమాన్ని నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, జిల్లాలోని 14 మండలాలకు చెందిన 48 హ్యాబిటేషన్లలో “జన్-భాగీదారి” కార్యక్రమాన్ని మే 18 నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీఎం జన్మన్ మరియు దజ్ గోవా గ్రామాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి రోజు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మే 19న అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, రాబోయే రోజుల కార్యక్రమాలపై గ్రామస్తులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే “జన సునవాయి” కార్యక్రమం నిర్వహించే ప్రదేశాలను ముందుగానే నిర్ణయించి, గ్రామ పెద్దలు మరియు ప్రజలకు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మే 20న గ్రామాల్లో “ట్రాన్సెక్ట్ వాక్” నిర్వహించి డ్రైనేజీ, పారిశుద్ధ్యం, ప్లాంటేషన్, తాగునీరు వంటి సమస్యలను గుర్తించి నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. పీడీ డ్వామా, ఏపీవోలు, మండల స్థాయి అధికారులు గ్రామాన్ని పూర్తిగా సందర్శించి ప్రజల అవసరాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని పేర్కొన్నారు. మే 21 నుండి 23 వరకు సచివాలయాలు లేదా ఎంపీడీవోలు నిర్ణయించిన ప్రదేశాల్లో “జన సునవాయి” కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్తుల ఫిర్యాదులు, సమస్యలను స్వీకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా హౌసింగ్ పథకాల పురోగతి, ప్రారంభం కాని ఇళ్ల వివరాలు, ఆధార్ కార్డులు, ఉపాధి హామీ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డుల అవసరాలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రతి హ్యాబిటేషన్కు నియమితులైన ఇంచార్జ్ అధికారులు తమ బృందాలతో కలిసి వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి ఎంపీడీవోలు, జిల్లా అధికారులకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మే 25న జిల్లా వ్యాప్తంగా వచ్చిన మొత్తం ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించి నివేదికను డైరెక్టరేట్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ మరియు భారత ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మే 19 నుండి 25 వరకు డిప్యూటీ డీఎంహెచ్ఓల పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు “జన్ భాగీదారి” స్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనుల పురోగతికి సంబంధించిన ఫోటోలు, వివరాలను నిరంతరం అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
Arattai