NANDYAL June27:– ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహించబోయే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే జిల్లా రాపిడ్,బ్లిట్జ్ జట్ల ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 30 వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాల స్వామి వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి రాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ పోటీలు వేరు వేరుగా నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు,ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ డాక్టర్. జి. రవికృష్ణ, జిల్లా చెస్ కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు.ఈనెల 29 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఏపీ చెస్ వెబ్ సైట్ లోఎంట్రీలు నమోదు చేసుకోవాలని,నంద్యాల జిల్లా ఎంపికైన క్రీడాకారులు త్వరలో కాకినాడ లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9010451585.
Arattai