NANDYAL :- నంద్యాల టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాలలో జరుగుతున్న సర్వే ప్రక్రియ సజావుగా సాగుతున్నప్పటికీ, ఫారమ్‌లను నింపిన తర్వాత చాలామంది వాటిని వెనక్కి ఇవ్వడం లేదని అన్నారు. నంద్యాల ప్రజలందరూ తప్పనిసరిగా ఫారమ్‌లను నింపి సంబంధిత అధికారులకు తిరిగి అందజేయాలని కోరారు. ఫారమ్ నింపే విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా సరే, అక్కడ అందుబాటులో ఉన్న బూత్ లెవల్ ఆఫీసర్లు (బిఎల్ఓ) మరియు బూత్ లెవల్ ఏజెంట్లను (బిఎల్ఎ) లను సంప్రదించి, ఎటువంటి తప్పులు లేకుండా ఫారమ్‌లను పూర్తి చేయాలని తెలిపారు.
ఈ ప్రక్రియను ఈ నెల 14వ తేదీలోపు పూర్తి చేయాలని, ప్రతి ఓటు చాలా కీలకమైనదని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్‌లు అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి, ఇంటింటికీ వెళ్లి ఫారమ్‌లను నింపేలా చూడాలని ఆదేశించారు. ఇది మనందరి భవిష్యత్తు కోసం చేస్తున్న పని కాబట్టి, ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఓటరు ఓటు నమోదు ప్రక్రియలో పాల్గొనేలా చూడాలన్నారు. రాబోయే పది రోజుల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు విశ్రాంతి లేకుండా, అంకితభావంతో ఈ పనిని పూర్తి చేయాలని ఎన్ఎండీ ఫిరోజ్ పిలుపునిచ్చారు. తానూ స్వయంగా రేపటి నుంచి పది రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షిస్తానని తెలిపారు.
Arattai