NANDYAL July15 :- నంద్యాల పద్మావతి నగర్ లోని వెలాసిటీ జూనియర్ కళాశాలలో సూర్య సేన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.

ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రారావు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ హాజరయ్యారు. చారిటబుల్ ట్రస్ట్ కరపత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. మొక్కలను నాటడం వాటిని సంరక్షించడం వంటివి విద్యార్థి దశ నుంచే చేపట్టాలని పిలుపునిచ్చారు.
Arattai