విజయవంతంగా కొనసాగుతున్న మధుమణి ఉచిత శస్త్ర చికిత్సల వైద్య శిబిరం
NANDYAL july 23:- నంద్యాల పట్టణంలోని మధుమణి నర్సింగ్ హోమ్ లో గత సోమవారం ప్రారంభించబడిన 36 వ ఉచిత చెవి, ముక్కు, గొంతు శస్త్ర చికిత్సల శిబిరం విజయవంతంగా కొనసాగుతున్నది.సోమవారం రోగులను ఎంపిక చేసుకుని అవసరమైన పరీక్షలు నిర్వహించి, మంగళవారం నుంచి రోజుకు 15 ఆపరేషన్ల చొప్పున ఉదయం 6:00 నుండి సాయంత్రం 6 గంటల వరకు చేస్తున్నారు. గురువారం సాయంత్రానికి 50 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు.ఈ వారం రోజులలో మధుమణి ఆసుపత్రి నిర్వాహకులు ప్రముఖ చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ మధుసూధన రావు,డాక్టర్ మణిదీప్,డాక్టర్ రోహిత్ లతోపాటు దేశంలో వివిధ నగరాలకు చెందిన ప్రఖ్యాత చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ రామకృష్ణ,డాక్టర్ శ్రీనివాస్ మూర్తి, డాక్టర్ మంజునాథ్,డాక్టర్ ఆర్షద్ హుస్సేన్, డాక్టర్ ఆదిత్య మూర్తి,డాక్టర్ శ్రీపతి నాయుడు, డాక్టర్ తేజ, డాక్టర్ అహిలా స్వామి, డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి,తదితరులు ఈ నెల 23 వ తేదీ వరకు మొత్తం 100 శస్త్ర చికిత్సలు ఉచితంగా ఈ శిబిరంలో చేయడం జరుగుతుంది. ఈ శస్త్ర చికిత్సలకు అవసరమైన అనస్థీషియాను ప్రముఖ మత్తుమందు వైద్యులు డాక్టర్. జి.రవి కృష్ణ, డాక్టర్.డి.మాధవి, డాక్టర్ వంశీ అందజేస్తున్నారు.ప్రతిరోజు ఓపిడీలో 200 మంది రోగుల్ని పరీక్షించి అవసరమైన మందుల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
Arattai