ఆగస్టు 5 నుంచి డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
NANDYAL Aug 04 :- 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 ఆగస్టు 5వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. డిగ్రీ కోర్సుల్లో చేరదలచిన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులందరూ తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన సమావేశంలో కళాశాల చైర్మన్ డా. జి. రామకృష్ణ రెడ్డి, ప్రిన్సిపాల్ కె.బి.వి. సుబ్బయ్య, డీన్ ఆఫ్ అకడమిక్స్ ఏ.ఎస్. ప్రగతి రెడ్డి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా. యు.వి.ఎస్. కుమార్ పాల్గొన్నారు.

డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు OAMDC పోర్టల్‌లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం తప్పనిసరి అని కళాశాల యాజమాన్యం స్పష్టం చేసింది. విద్యార్థులు తమంతట తామే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే విద్యార్థుల సౌకర్యార్థం కళాశాలలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు అవసరమైన పత్రాలతో కళాశాలకు వచ్చి హెల్ప్ డెస్క్ ద్వారా తమ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవచ్చని సూచించారు.
విద్యార్థులు తప్పనిసరిగా తీసుకురావాల్సిన పత్రాలు:
- SSC మార్కుల మెమో
- ఇంటర్మీడియట్ మార్కుల మెమో
- కుల ధృవీకరణ పత్రం
- ఆదాయ ధృవీకరణ పత్రం
- విద్యార్థి ఆధార్ కార్డు
- తల్లిదండ్రుల ఆధార్ కార్డులు
- 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి డిగ్రీలో ప్రవేశం పొందాలనుకుంటే OAMDC ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలని కళాశాల యాజమాన్యం కోరింది.విద్యార్థులు చివరి తేదీ కోసం వేచి ఉండకుండా 2026 ఆగస్టు 5వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌లో ఎలాంటి సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఎదురైనా కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను వినియోగించుకోవాలని తెలిపారు.
Arattai