విద్యాశాఖ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లలో పనితీరు మెరుగుపర్చాలి : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Aug05:- విద్యాశాఖ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల (కేపీఐలు)లో జిల్లా పనితీరును మెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కేపీఐల అమలు, లీప్ (LEAP) యాప్లో డేటా నమోదు, పాఠశాలల పనితీరుపై సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు కేటాయించిన 38 కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లను నిర్దేశిత గడువులోగా తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు కేపీఐల నమోదును పూర్తి చేయాలని సూచించారు. వీటిలో డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ విభాగాలకు సంబంధించిన సూచీలను నిర్దేశిత గడువులోగా తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. వారపు సూచీలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు 95 శాతానికి పైగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులందరూ లీప్ యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం వినియోగం, పేరెంట్ ఫీడ్బ్యాక్, పబ్లిక్ పర్సెప్షన్ మెరుగుపడేలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

విద్యార్థుల నమోదు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల హాజరు, లీప్ యాప్ డౌన్లోడ్, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల తనిఖీలు, డ్రాపౌట్ల తగ్గింపు, అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లల గుర్తింపు, ఎఫ్ఎల్ఎన్ అమలు, అపార్ ఐడీ నమోదు, విద్యార్థి కిట్ల పంపిణీ, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు కేపీఐలపై పూర్తి అవగాహనతో పనిచేస్తూ లీప్ యాప్లో ఖచ్చితమైన సమాచారాన్ని సకాలంలో నమోదు చేయాలని, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి జిల్లాను అన్ని సూచీల్లో మెరుగైన స్థానంలో నిలిపేందుకు కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనితీరు మెరుగుపడని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఎన్రోల్మెంట్లో వెనుకబడిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖ అధికారి పి. జనార్దన్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Arattai