నంద్యాలలో ప్రశాంతంగా ఏబీవీపీ బంద్
NANDYAL Aug 05:- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో.రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బందుకు పిలుపు మేరకు నంద్యాలలో అన్ని కళాశాలలో స్వచ్ఛందంగా సెలవును ప్రకటించి,బందుకు మద్దతుగా నిలిచాయని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ లక్ష్మీనరసింహ,నంద్యాల కన్వీనర్ మహేష్ తెలిపారు.జిల్లాలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలను,ఇంజనీరింగ్ కళాశాలుగా అప్ గ్రేడ్ చేయాలని,సాంఘిక సంక్షేమ వసతి గృహాలను పక్కా భవనాల నిర్మించి,నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని కోరుతూ బంధు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు చైతన్య, నరేష్, సాయి, కేదార్నాథ్, నంద్యాల జిల్లా కన్వీనర్ లక్ష్మీనరసింహ, నంద్యాల నగర కన్వీనర్ మహేష్ నాయుడు పలువురు పాల్గొని బందున విజయవంతం చేశారు.
Arattai